ETV Bharat / state

Cinema Tickets Issue: రాష్ట్రమంతా ఒకే టికెట్‌ ధర ఉండాలి.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌ - exhibitors

రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్పందించారు. జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయిస్తే మూతే మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

exhibitors-and-distributors-demand-for-a-single-ticket-price-across-the-state
రాష్ట్రమంతా ఒకే టికెట్‌ ధర ఉండాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌
author img

By

Published : Dec 28, 2021, 7:18 AM IST

రాష్ట్రమంతా ఒకే టికెట్‌ ధర ఉండాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌

జీవో 35 ప్రకారం థియేటర్ల నిర్వహణ సాధ్యం కాదని.. సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాపోయారు. లేదంటే థియేటర్లు మూసేయడం మినహా మరో మార్గం లేదని రాజమహేంద్రవరంలో తెలిపారు. థియేటర్లను ఏబీసీ కేటగిరీల కింద విడగొట్టకుండా ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అందరికీ ఒకేరకమైన టికెట్ టారిఫ్ అమలు చేయాలని కోరారు.

సామరస్యంగా పరిష్కరించుకునేందుకు..

మరోవైపు సినిమా టికెట్ల ధరల విషయమై ప్రభుత్వంతో చర్చలకు థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సమస్యలు చెప్పుకునేందుకు తమకు సమయం ఇవ్వాలని సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కోరారు. సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమని మంత్రికి తెలపగా.. ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. ఈరోజు సచివాలయంలో మంత్రి పేర్ని నానిని.. థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసే అవకాశం ఉంది. సినిమా థియేటర్లలో టికెట్‌ ఛార్జీలు సహా తినుబండారాల రేట్లు నియంత్రణ, తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి:

వంగవీటి రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లతో భద్రత.. సీఎం జగన్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.