ఆత్రేయ పాటల భావుకతను ఆరాధించే ఓ అధ్యాపకుడు.. ఆయన సాహిత్యాన్ని భద్రంగా నేటి తరాలకు అందించేందుకు అలుపెరుగని కృషి చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నివసించే విశ్రాంత తెలుగు అధ్యాపకుడు పైడిపాల.. 1989లోనే ఆత్రేయ సాహితీ పేరిట మహత్తర సంకల్పానికి శ్రీకారం చుట్టారు. అలనాటి నటుడు జగ్గయ్య మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరించగా.. పైడిపాల సహ సంపాదకుడిగా ఆత్రేయ రచనా సర్వస్వాన్ని 7 సంపుటాలుగా వెలువరించారు. నాడు ఆయా రచనలకు సినీ ప్రేక్షక లోకం, ఆత్రేయ అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించింది. మొదటి 3 సంపుటాలలో ఆత్రేయ నాటక సాహిత్యం, తరువాత 3 సంపుటాలలో 1092 సినీ పాటలు, ఏడో సంపుటిలో కదంబం పేరిట ఆత్మకథ రచించారు.
ఇదీ చదవండి: 72 శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే..
2017లో ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమానికి పైడిపాల అతిథిగా హాజరయ్యారు. మరోసారి సమగ్రంగా ఆత్రేయ పాటల సేకరణ బాధ్యత తీసుకోవాలని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.. నాడు పైడిపాలను కోరారు. నాటినుంచీ శ్రమించి ఆత్రేయ రచించిన మరో 544 సినీ పాటలు జోడించి 2 భాగాలుగా మరోసారి సిద్ధం చేశారు. మే 7న ఆత్రేయ శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ పుస్తకాల ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసినప్పటికీ.. కరోనా కారణంగా కార్యక్రమం జరపలేని పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే మొత్తం 1636 పాటలతో ఉన్న పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పైడిపాల తెలిపారు.
ఇదీ చదవండి:
రూ.1,27,22,435 కట్టాల్సిందే!.. సుద్ద అక్రమ తవ్వకాలపై చర్యలు ఖరారు!