ప్రజలకు కేరళ ప్రభుత్వం ఇచ్చిన విధంగా... 16 రకాల నిత్యావసర వస్తువులను ఇంటింటికీ ప్రభుత్వమే అందించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధిపై దృష్టి పెట్టకుండా పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: