కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు చేయూత అందించేందుకు ఇవాంజిలికల్ మినిస్ట్రీస్ సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామంలో ఆ సంఘం ప్రతినిధులు రాజబాబు, డాక్టర్ చిన్నం సిల్వస్టర్ ఆధ్వర్యంలో 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. లోతట్టు గ్రామమైన గుర్తేడు, పాతకోట గ్రామాల్లోను ఇలా పంచిపెడతామని ప్రతినిధులు తెలియజేశారు.
ఇదీ చదవండి :