కరోనాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్ అన్నారు. జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న 250 పడకలను 400 కు పెంచామని చెప్పారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులను సమకూర్చామని వివరించారు.
కొవిడ్ కేసులను 3 రకాలుగా పరిగణిస్తూ తగిన విధంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఐసీయూలో ఉంచుతున్నామని చెప్పారు. సిబ్బంది కొరతపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని..రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. సాధారణ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.
ఇదీ చదవండి