భారీ వర్షాల కారణంగా అమలాపురం డివిజన్లో జరిగిన పంట నష్టం వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో నీటమునిగిన పంటలను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సమస్యలను పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు దెబ్బతిన్న పంట వివరాలను నోటీసు బోర్డులో పెట్టడమే కాకుండా వాటిపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిపై తక్షణం స్పందిస్తామన్నారు.
ఇదీ చదవండి: రెండుసార్లు వేలిముద్ర వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: డీలర్లు