కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అనవసరంగా రహదారుల మీదకు వస్తే కేసులు నమోదు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై సురేంద్ర హెచ్చరించారు. ప్రధానంగా యువత తిరిగితే ఎంత మాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. ముంజవరం, కటారిలంక, ముంగండ పాలెం, పి గన్నవరం తదితర గ్రామాలలో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.
ఇదీ చూడండి