ETV Bharat / state

ప్రముఖులకు తప్పని కరోనా పరీక్షలు - ప్రముఖులకు తప్పని కరోనా పరీక్షలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కరోనా బాధితులున్న ప్రాంతాలు, రెడ్‌జోన్లలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

east godavari dst collector participate corona tests
ప్రముఖులకు తప్పని కరోనా పరీక్షలు
author img

By

Published : Apr 7, 2020, 8:03 AM IST

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 100 మందికి సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ డాక్టర్‌ లక్ష్మీశ, జేసీ-2 రాజకుమారి, డీఆర్వో సత్తిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సత్యసుశీల ఈ పరీక్షలు చేయించుకున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర తదితరులకు కూడా ఈ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు కరచాలనం చేయడం విమర్శలకు దారితీసింది. అంతకు ముందు కాకినాడకు చెందిన పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి ఎస్పీ, కలెక్టర్‌ కార్యాలయాల్లోని పలువురు అధికారులను ప్రత్యక్షంగా కలిశారు. దీనికితోడు జిల్లాలో రెడ్‌జోన్లలో కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటీవల పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.