తితిదే ఆస్తుల విక్రయం, శ్రీవారి లడ్డు అమ్మకాలపై తితిదే నిర్ణయాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయానికి తితిదే పాలకమండలి నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచిందని ఆరోపించారు.
తమిళనాడులో 23 ఆస్తులను అమ్మకానికి పెట్టిందని... ఆ దిశగా రెండు అధికార బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామి వారి ఆస్తులను అమ్మకానికి పెట్టటం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు.
తితిదే ధర్మకర్తల మండలి ప్రభుత్వ నిర్ణయాలనే కాకుండా ప్రజల అభిప్రాయం, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను వెనక్కు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి సోమవారం రాష్ట్రానికి రానున్న చంద్రబాబునాయుడు