తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అర్చక ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్వహించిన పరీక్షకు 21 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఆలయ అధికారులు తెలిపారు. వీరిని దేవస్థానం ఈవో త్రినాధరావు అభినందించి ధ్రువ పత్రాలు అందించారు.
ఇదీ చూడండి..