తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో నిర్మిస్తున్న పోలవరం పునరావాస కాలనీకి తన భూమి ఇచ్చినా... ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదని ఓ రైతు కంచె వేశారు. ఇళ్ల నిర్మాణానికి ఎకరంన్నర భూమి ఇచ్చానంటున్న సత్తిబాబు... పరిహారం విషయమై అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంచె వేస్తున్నారని సమాచారం అందుకున్న స్థానిక రెవెన్యూ అధికారులు... అక్కడికొచ్చి సత్తిబాబుతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి