రైతులకు ఉచిత బోరుబావుల తవ్వకానికి సంబంధించి వైఎస్సార్ జలకళ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లాలో సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ తెలిపారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం పట్టణ నియోజకవర్గాలు మినహా జిల్లాలో బోరుబావుల రిగ్గుల వాహనాలను సమకూర్చినట్లు వెల్లడించారు.
సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జెండా ఊపి రిగ్ వాహనాన్ని ప్రారంభించారు.
రైతుల పక్షపాతిగా జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివరించారు. 1700 కోట్లతో చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమని అన్నారు.
ఇదీ చదవండి: