తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి సందర్శించారు. గ్రామంలోని పరిస్థితులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామస్థులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తితో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
గ్రామంలో కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భయపడాల్సిన పని లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే అధికారులకు సమాచారమివ్వాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల లాక్ డౌన్ నిబంధనలు సడలించడం జరిగిందని.. ఇకపై ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి... స్వచ్ఛ పల్లెకు సన్నద్ధం.. 'మనం-మన పరిశుభ్రత' ప్రారంభం