దిల్లీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల నిర్వర్తిస్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసి వెంకట్ రావు అదృశ్యమైన కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సెలవు కోరేందుకు మే 26న సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి వెళ్లిన వెంకట్రావు తిరిగి రాలేదని.. నాలుగు నెలలు గడుస్తున్న ఆచూకీ లభ్యం కాలేదని భార్య, తల్లి సహా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
కార్యాలయంలోని ఉన్నతాధికారుల వేధింపులు గురి చేశారని.. వారిపైన వెంకట్ రావు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. కేసును న్యాయస్థానం క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసి వెంకట్రావు ఆచూకీ కనుక్కోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : ఆ గాయానికి 8 ఏళ్లు.. అయినా సంతృప్తినిచ్చింది: చంద్రబాబు