తూర్పుగోదావరి జిల్లా శంఖవరం పంచాయతీలో అనూహ్యం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ స్వగ్రామమైన శంఖవరం పంచాయతీని... వైకాపా మద్దతుదారుతో ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నం ఫలించింది. అయితే ముందు నుంచి అనుకున్న అభ్యర్థి కాకుండా.. డమ్మీగా బలపరచిన అభ్యర్థిని పదవి వరించింది. ఈ పంచాయతీలో ఎమ్మెల్యే పూర్ణచంద్ర.. బందిలి ధనలక్ష్మిని బలపరచగా, బందిలి గన్నియమ్మ డమ్మీ అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు. ‘ముగ్గురు పిల్లలు’ నిబంధనతో ధనలక్ష్మి నామినేషన్ తిరస్కరణకు గురైంది. డమ్మీగా వేసిన గన్నియమ్మ నామపత్రాలు సవ్యంగా ఉండడంతో ఆమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: మన్యంలో ఎన్నికల పోలింగ్ సమయం కుదింపు