తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరం నుంచి వరదనీటిని దిగువకు వదలడంతో కేంద్రంపాలిత ప్రాంతమైన యానాం వద్ద గౌతమి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అతిపెద్ద శివలింగం, గోదావరిమాత విగ్రహాల వద్దకు వరద నీరు చేరింది. దీంతో ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే రాజీవ్ బీచ్ ఒక్క సారిగా నీట మునగటంతో కళతప్పింది. బాలయోగి వారథి వద్ద వరద ప్రవాహం ఉద్ధృతంగా సముద్రంలోకి పారుతుంది.
ఇదీ చూడండి :వంశధార పొంగింది... బొమ్మ పడింది...