తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం వుడుమూడి గ్రామానికి ఎదురుగా ఉన్న వశిష్ట ఎడమ ఏటిగట్టు దిగువన.. గోదావరి ఒడ్డున నివాసముంటున్న నిరుపేదల కుటుంబాల పరిస్థితి గోదావరి వరదల కారణంగా దయనీయంగా మారింది. సుమారు 20 నిరుపేద కుటుంబాలు సంవత్సరాల తరబడి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. పక్షులు ఇతర జంతువులు వేటాడి బతుకు వెళ్లదీస్తారు. గోదావరి ఒడ్డున వేసుకున్న పూరి గుడిసెలు వరద నీటిలో మునిగి పోయాయి. దీంతో వారంతా ఏటి గట్టు మీదకు చేరి గుడిసెలు వేసుకుని వాటిపై టార్పన్లు కప్పుకుని తలదాచుకుంటున్నారు. అన్నం వండుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి. చిన్న పిల్లలతో వారు పడుతున్న అవస్థలు దయనీయం. వరదలొచ్చినప్పుడల్లా తమ పరిస్థితి ఇదేనని... పట్టించుకునే నాథుడే లేడని గోడు వెలిబుచ్చుకుంటున్నారు.
ఇదీ చూడండి