రాజమహేంద్రవరంలోని బిహార్, జార్ఖండ్‌కు చెందని వలస కార్మికులను... వారి స్వస్థలాలకు పంపించే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి వలస కార్మికులను రాజమహేంద్రవరం తరలించారు. వీరందరినీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చేర్చారు.
సుమారు 1578 మంది కార్మికులు వారి స్వస్థలాలకు పంపించేందుకు శ్రామిక్ రైలును స్టేషన్‌లో అందుబాటులో ఉంచారు. అయితే వారిని తరలించేందుకు చేపట్టాల్సిన ప్రక్రియ జరగక... పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు అందించేందుకు ఒక ట్యాంకరు రాగా... దాని వద్దకు ఎగబడ్డారు. తమను స్వస్థలాలకు చేర్చే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన 1170 మంది బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను... ఆయా మండలాల తహసీల్దారులు గుర్తించారు. వారిని చిత్తూరుకు తరలించి.. వసతి సదుపాయాలు కల్పించి.. గురువారం రాత్రి వీరిని ప్రత్యేక శ్రామిక రైలులో బీహార్ కు పంపించారు.
ఇదీ చదవండి: