ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రానున్న రోజుల్లో ఇంటింటికీ కుళాయి వేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ తెలిపారు. తాళ్లరేపు మండలం ఇంజవరం గ్రామంలో పర్యటించి మంచినీటి కుళాయిలు ప్రారంభించారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ గ్రామస్థులు... ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన వారం రోజుల్లో కుళాయిలు ఏర్పాటు చేయాలని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. తమ గ్రామానికి మంచి నీరు వచ్చినందుకు అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :