కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఉండేందుకు కేంద్ర ఆయుర్వేద విభాగం తయారు చేయించిన హోమియో మాత్రలను వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. పుదుచ్చేరి రాష్ట్రంలో ఈ పంపిణీని ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. తక్కువ జనాభా కలిగిన యానాం, మాహే ప్రాంతాల్లో వీటిని ఇంటింటికీ ఆరోగ్య శాఖ సిబ్బంది అందిస్తున్నారు.
పది సంవత్సరాలు పైబడినవారు ఉదయం అల్పాహారం ముందు.. రాత్రి భోజనానికి ముందు మూడేసి మాత్రల చొప్పున మూడు రోజులపాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరు వీటిని వేసుకోవాలని డాక్టర్లు సూచించారు. చిన్న పిల్లలకు ఒకటి రెండు మాత్రమే మాత్రలు వేయాలన్నారు. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: