కేంద్రపాలిత ప్రాంతం యానంలో సామాజిక అధికారిత శిబిరం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కేంద్ర కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శిబిరంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు.
పుదుచ్చేరి ప్రభుత్వం.. ప్రత్యేక అవసరాలున్న వారిని గుర్తించి ఒక్కొక్కరికి నెలకు రూ.3500 చొప్పున పింఛన్ అందజేస్తోందని తెలిపారు. ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా 308 మందికి రూ.21లక్షల వ్యయంతో కృత్రిమ కాళ్లు, చేతులు, ట్రై సైకిల్, వాకర్, వినికిడి యంత్రాలు అందజేశారు. ఇతరులకు అవసరమైన ఉపకరణాలను వితరణ చేశారు.
ఇదీ చదవండి: