నాటు సారా దాడుల్లో పోలీసుల విధులకు ఆటంకం - తూర్పుగోదావరిలో నాటు సారా దాడుల తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం గాజుల గుంట గ్రామంలో నాటుసారా సమాచారం మేరకు వెళ్లిన పోలీసులను సారా తయారీదారులు బుధవారం అడ్డుకున్నారు. పి. గన్నవరం ఎస్ఐ హరీష్ కుమార్కు వచ్చిన సమాచారం మేరకు గాజుల గుంట వెళ్లి నాటు సారా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. నాటు సారా తయారు చేసే ముగ్గురు వ్యక్తులు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Disruption of police duties in Natusara attacks at gajula gunta in east godavari