వరదలతో కోనసీమ లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గోదావరి ఉద్ధృతి వరదలు పూర్తిగా తగ్గినప్పటికీ గ్రామాల్లో బాధలు తప్పలేదు. లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. ఉద్యాన పంటల్లో నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. కోనసీమలో 74 లంక గ్రామాలు వరదల్లో మునిగాయి. ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని అధికారులు తొలగించే ఏర్పాట్లు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: