తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి సిద్ధి వినాయకుడి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయం వెలుపల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
అనంతరం సిద్ధి వినాయకుడి ఉత్సవమూర్తిని పల్లకిలో మేళతాళాలతో ఊరేగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: