కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో విధించిన లాక్డౌన్ ప్రభావం అన్నవరం దేవస్థానం అభివృద్ధి పనులపై పడింది. లాక్డౌన్ కారణంగా ఆలయానికి భక్తుల ప్రవేశం ఆపేయటంతో... ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 30 శాతానికి పైగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాలకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా... ఈ ఏడాది 10 కోట్ల రూపయల బడ్జెట్ను కేటాయించారు. మెట్ల మార్గం, నిత్యాన్నదాన భవనం, వసతి సముదాయాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా... శివ సదన్, ఈవో క్వార్టర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కూలీలు అరకొరగా ఉండటంతో పనులు మందకొండిగా జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థతి దృష్ట్యా అనుకున్న గడువులో అభివృద్ధి పనులు జరగటం కష్టంగా మారింది.
ఇదీ చదవండి: శుద్ధి చేసే చేతులతో పవర్ లిఫ్టింగ్... పతకాల సాధనకు కావాలి సాయం...