ఆరాధించే నటులు పేరుతో సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైన అభిమానానికి నిదర్శనమని.. తూర్పుగోదావరి జిల్లా మండపేట జనసేన ఇంఛార్జి వేగుళ్లు లీలాకృష్ణ అన్నారు. మండపేట మెగా అభిమాన యువత పట్టణ అధ్యక్షులు కొంతం నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి లీలాకృష్ణ హాజరయ్యారు. నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన థియేటర్ల సిబ్బందికి నిత్యావసరాలు, కూరగాయలు అందించారు. అందరి హీరోల అభిమానులు ముందుకొచ్చి ఇలాంటివారిని ఆదుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి.. యువకుడి మానవత్వం... ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ