ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో జోరువానలు.. ధాన్యం రైతును వెంటాడిన మరో విపత్తు

నివర్‌ తుపాను ప్రభావం జిల్లాపై భారీగానే పడింది. బుధవారం రాత్రి నుంచి వీస్తున్న ఈదురు గాలులు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు కునుకు పట్టనీయలేదు. ఇప్పటికే 1.82 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలను కోల్పోయిన రైతులు తాజా వాతావరణ మార్పులతో మరింత నష్టం చవిచూడాల్సి వస్తోంది. వరి కోతలు కొద్ది రోజుల్లో పూర్తయి.. పంట చేతికొచ్చే తరుణంలో భారీ గాలులు, వర్షాలు పీకల్లోతు నష్టాల్లోకి నెట్టేశాయి. గాలులకు కొంత పంట నేలకొరిగితే.. పంట నూర్చి కుప్పలు పోసిన కళ్లాల్లో నూర్పిడికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి రైతులు ఘొల్లుమంటున్నారు.

crop loss due to heavy
crop loss due to heavy
author img

By

Published : Nov 27, 2020, 12:44 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో జోరువానలు.. ధాన్యం రైతును వెంటాడిన మరో విపత్తు

తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం, మైదానం, కోనసీమలో వానలు కురుస్తున్నాయి. కాకినాడ, రామచంద్రాపురం, రాజమహేంద్రవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గోదావరి తూర్పు, మధ్య డెల్టాలతోపాటు మెట్ట ప్రాంతంలోనూ వరి పంట తడిసిపోవటంతో రైతులు నష్టపోయారు. కోసిన వరి పంట నీటిలో నానుతుండడంతో నాణ్యత, మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిస్థితిపై కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ సమీక్షించారు.

నష్టాలు మిగిల్చిన నివర్‌..

నివర్‌ ప్రభావంతో తెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో కోతకు సిద్ధమైన వరిచేన్లు చాలాచోట్ల నేలకొరిగాయి. వర్షాలకు పంటతోపాటు నిల్వలూ తడిసి మిగిలిన పంటల కోతకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఉప్పలగుప్తంలో 1,850 హెక్టార్లలో వరి పడిపోయింది. అమలాపురం 1,450, రాజోలు 996, తొండంగి 706, మామిడికుదురు 685, అల్లవరం 650 హెక్టార్లలో పంట నేలకొరిగింది. పి.గన్నవరం, మలికిపురం, అయినవిల్లి, సామర్లకోట, కోరుకొండ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పాడ కొత్తపల్లి, కాజులూరు, మలికిపురం మండలాల్లో పంట తడిసింది. సామర్లకోట 2,000, రామచంద్రాపురం 1,400 హెక్టార్లలో కళ్లాల్లో ఉంచిన ధాన్యం తడిసింది. పెదపూడి 1,500, మండపేట 1,200, కపిలేశ్వరపురంలో వెయ్యి హెక్టార్ల పంట దెబ్బతింది.

తీరంలో గుండెకోత

నివర్‌ తుపాను నేపథ్యంలో యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరప్రాంతంలో స్వల్పంగా ప్రభావం చూపింది. సముద్రంలో మార్పులు ఏర్పడి రెండు రోజులుగా రాత్రి సమయంలో భారీ కెరటాలు ఎగసిపడడంతో తీరప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి. ప్రధానంగా ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలు సముద్రాన్ని ఆనుకుని ఉండడంతో కెరటాలు నేరుగా గృహాలను తాకాయి. దీంతో పలు ఇళ్లు నేలకూలగా, మరికొన్ని బలహీనపడి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. తుపాను సమయంలో ప్రతిసారి ఈ గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలకూలి ఎన్నో కుటుంబాలు నీడ లేకుండా పోతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పొలాలు నీట మునిగాయి. డ్రైన్లు పొంగి ప్రవహించడంతో రహదారులపై నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి.

ఏలేరు నుంచి 2100 క్యూసెక్కుల నీరు విడుదల

ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి గురువారం 2,100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు (24.11 టీఎంసీలు). ప్రస్తుతం ఏలేరులో 86.42 మీటర్ల స్థాయిలో 23.82 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున వరదలపై అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీవాహక ప్రదేశం నుంచి వచ్చే నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగెకరాలు నీటిపాలు

పి.గన్నవరం శివారు చిట్టిలంకపేట గ్రామ కౌలురైతు సాయిబాబు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశారు. ఇటీవల అధిక వర్షాలు, ఎండాకు తెగులుతో పంట దెబ్బతింది. మిగిలిన పంటను దక్కించుకోవాలని ఆశించగా.. ‘నివర్‌’ నిలువునా కూల్చిందని వాపోయాడు. చేను నేలవాలి మరింత నష్టం ఏర్పడిందన్నాడు. ఇప్పుడు కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొందన్నాడు. రూ.లక్ష పెట్టుబడి నీటి పాలైందని కన్నీరుమున్నీరయ్యాడు.

కదిపితే కన్నీరే

వరి కుప్ప చుట్టూ చేరిన నీటిని తరలిస్తున్న రైతు బాబ్జీది ఐ.పోలవరం మండలం కేశనకుర్రు. 1.5 ఎకరా కౌలుకు తీసుకుని వరి వేశారు. ఇటీవల వర్షాలకు చేను మునిగింది. ఎకరాకు 10 బస్తాలు కూడా వచ్చేలా లేదు. కూలి రేట్లు పెరిగినా.. వ్యయప్రయాసలకోర్చి కోత కోయించి కుప్పగా పెట్టారు. ‘నివర్‌’ దెబ్బకు కుప్ప చుట్టూ నీరు నిలిచి కింద నుంచి తడిసింది. దీంతో నీటిని బయటకు పంపడానికి వర్షంలోనే శ్రమిస్తున్నారు.

ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.