తూర్పుగోదావరి జిల్లా రాజుపాలెం, ముక్కొల్లు, గెద్దనాపల్లి, ఎస్.తిమ్మాపురం, రామకృష్ణాపురం పరిధిలో ఎర్ర కాలువ, ఖండి కాలువ, గొర్రిఖండి, వాలు కాలువలకు 10 గండ్లు పడ్డాయి. 60 కి.మీ. మేర కాలువ గట్లు బలహీనంగా మారాయి.
సెప్టెంబరులో వరదలకు 1,500 ఎకరాల్లో, ప్రస్తుత వరదలకు 7,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జలాశయం నుంచి విడుదలవుతున్న వరద మొత్తం అన్ని గ్రామాల మీదుగానే ప్రవహించడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాలువలు కూడా దెబ్బతింటున్నాయి.
ముక్కొల్లు వెళ్లే రోడ్డు, వంతెనల పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తూ రాకపోకలు నిలిచాయి. ఈ గ్రామం చుట్టూ ప్రధాన వరద కాలువలు ఉండటంతో ప్రజలు వణుకుతున్నారు. రాజుపాలెం వెంట వాలు కాలువ గట్టు బలహీనమై గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఎస్.తిమ్మాపురం, భూపాలపట్నం మధ్య వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. గోనేడకు ఓవైపు ఏలేరు వరద నీరు, రామవరం వైపు నుంచి పోలవరం వరద పోటెత్తి ముంపు తలెత్తింది.
వీరరాఘవపురం, రాపర్తి, జములపల్లి, ఇల్లింద్రాడ, పిడిందొడ్డి, పీబీసీ పరిధిలో మరోచోట గండ్లు పడి.. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సెప్టెంబరులో 4,500 ఎకరాలు.. తాజాగా మరో 1,500 ఎకరాల్లో పంట మునిగింది. గోకివాడ, రాపర్తి, పిఠాపురంలో కోర్టు ప్రాంగణం- వై.జంక్షన్, పిఠాపురం- గొల్లప్రోలు మార్గాలు, కాకినాడ- కత్తిపూడి హైవే పైనా వరద ప్రవహిస్తోంది.
గొల్లప్రోలులో నక్కలకండి కాలువకు, కొత్తకాలువకు, చిన్నజగ్గంపేటలో జగ్గమ్మచెరువుకు గండ్లు పడ్డాయి. సెప్టెంబర్‌లో వరదలకు 5,500 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇప్పుడదే పంట, మరో 2,500 ఎకరాల్లో పంట నీట మునిగింది. చేబ్రోలు- మల్లవరం రహదారి, గొల్లప్రోలు- తాటిపర్తి రోడ్డు, చెందుర్తి నుంచి తాటిపర్తి వెళ్లే కుంత రోడ్డు, చిన జగ్గంపేట రోడ్డుతోపాటు గొల్లప్రోలు- పిఠాపురం మధ్య జాతీయ రహదారి, గొల్లప్రోలు బైపాస్‌పై నీరు ప్రవహిస్తోంది.
ఏలేరు వరదల ప్రభావం కిర్లంపూడి, జగ్గంపేట, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, కాకినాడ నగర, గ్రామీణ మండలాలపై పడింది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ఆవహించి ఎటూ కదలకుండా చేస్తే.. సెప్టెంబరు, అక్టోబరులో వరసగా వచ్చిన ఏలేరు వరద పంట చేతికి అందకుండా చేసింది. రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలిగించింది.
పుష్కరం తర్వాత ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నిర్మాణం తర్వాత 2008లో ఎగువ నుంచి 40 వేల క్యూసెక్కుల భారీ వరద నీరు ప్రాజెక్టుకు చేరింది. ప్రాజెక్టులో ప్రతి వ΄డేళ్లకోసారి 86 మీటర్ల స్థాయికి నీరు చేరుకుంటుంది. పుష్కర కాలం తర్వాత మళ్లీ ఈనెల 13న ఏలేరుకి 26 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.
సామర్లకోట కాపవరం, వేట్లపాలెంలో చెరువులకు గండ్లు పడ్డాయి. సెప్టెంబరులో 550 ఎకరాలు, ఇప్పుడు 6,625 ఎకరాలు దెబ్బతిన్నాయి. సామర్లకోట- పిఠాపురం ప్రధాన దారిపై పెద్ద ఏలేరు కాలువ వద్ద నాలుగు అడుగుల మేర నీరు పారుతోంది. కాకినాడ- సామర్లకోట దారిలో భారీ గుంతలు పడ్డాయి. కాట్రావులపల్లి, జగ్గంపేట పరిధిలో 15 చోట్ల గండ్లు పడ్డాయి. 20 చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. ః సెప్టెంబరులో వెయ్యి ఎకరాలు, తాజాగా మరో 250 ఎకరాలు మునిగింది. హెక్టారుకు రూ.15 వేలు వంతున నష్టం అంచనా వేశారు. ః రామవరంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. రంగవల్లి నగర్, భగత్‌సింగ్ నగర్ కాలనీలను వరదనీరు ముంచెత్తింది.
ఇదీచదవండి :