ETV Bharat / state

యానాంలో.. స్వతంత్ర అభ్యర్థి తరఫున నారాయణ ప్రచారం - యానాం శాసనసభ ఎన్నికల ప్రచారం

కేంద్ర పాలిత యానాంలో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. చివరి నిమిషం వరకు అందుబాటులో ఉన్న నేతలతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న అశోక్​ తరపున.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారం చేశారు.

cpi narayana election campaign, yanam election campaign
యానంలో ఎన్నికల ప్రచారం, యానం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ కార్యదర్శి నారాయణ
author img

By

Published : Apr 4, 2021, 4:38 PM IST

కేంద్ర పాలిత యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో.. చివరి రోజు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఆఖరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్​కు మద్దతుగా.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారం చేశారు.

దేశంలోని ప్రధాన ఆదాయ రంగాలన్నిటినీ మోదీ కార్పొరేట్ సంస్థల చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులకూ కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో భాజపా అధికారంలోకి వస్తే.. ఆ రాష్టాన్నీ అమ్మేస్తారని ఆరోపించారు. యువకుడు, విద్యావంతుడైన అశోక్​ని గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:

కొలిమేరు వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. పది మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.