పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్మించిన టిడ్కో గృహ నిర్మాణాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని.., మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కోనాల భీమారావు, బొద్దాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి...
టిడ్కో ఇళ్ల రుణాలను మాఫీ చేసి ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల హామీని నేరవేర్చాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అగ్రహారం వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఆయన...సకాలంలో ఇళ్లు అందక లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి