ETV Bharat / state

కొవిడ్‌ రోగి అదృశ్యం.. తండ్రి ఆచూకీ చెప్పాలని కుమారుడు వేడుకోలు - ఈరోజు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ రోగి అదృశ్యంపై కొడుకు ఆవేదన వార్తలు

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో.. గంటన్నర వ్యవధిలో తన తండ్రి కనిపించకుండా పోయారనీ, అసలేం జరిగిందో తెలియడం లేదని అతడి కుమారుడి ఆవేదన అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. సిబ్బందితో మొత్తం వెతికించినా ఫలితం లేక పోలీసులకు తెలిపామని ఆర్‌ఎంవో ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

రాజమహేేంద్రవరం ఆసుపత్రిలో ఆదృశ్యమైన కొవిడ్ రోగి

author img

By

Published : May 16, 2021, 1:13 PM IST

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కొవిడ్‌ రోగి అదృశ్యమైన ఘటన శనివారం వెలుగుచూసింది. గంటన్నర వ్యవధిలో తన తండ్రి కనిపించకుండా పోయారనీ, అసలేం జరిగిందో తెలియడం లేదని అతడి కుమారుడి ఆవేదన అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. బాధితుల కథనం మేరకు... హుకుంపేటవాసి చాగంటి రామచంద్రరావు (61)కు ఈ నెల 7న ప్రైవేటుగా పరీక్ష చేయిస్తే పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లోనే ఉంచి మందులు వాడినా ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 10న బొమ్మూరు కొవిడ్‌ కేర్‌ కేంద్రానికి తరలించారు. అదేరోజు రాత్రి.. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు తక్షణ చికిత్స చేసి ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవనీ, ఖాళీ అయితే కేటాయిస్తామని చెప్పారు. రాత్రంతా అక్కడే ఉండగా.. 11న ఉదయం ఆరు గంటలకు వరండాలో సాధారణ పడక ఇచ్చారు.

గంటన్నరలోనే...:

రామచంద్రరావు బంధువు ఒకరు ఆసుపత్రికి వచ్చి తాను చూసుకుంటాననీ, నువ్వు ఇంటికి వెళ్లమని చెప్పడంతో సుబ్రహ్మణ్యం వెళ్లాడు. మధ్యాహ్నం మూడు గంటలకు తాను వెళ్తున్నాననీ.. నువ్వు ఆసుపత్రికి రావాలని చెప్పి బంధువు 3:30 గంటలకు వెళ్లిపోయాడు. సుబ్రహ్మణ్యం సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రికి రాగా అతడి తండ్రి కన్పించలేదు. సిబ్బంది, వైద్యులను అడిగితే తమకూ కనిపించ లేదన్నారు. ఏం చేయాలో తెలియక ఔట్‌పోస్టు పోలీసులకు చెప్పగా వారు విధుల్లో ఉన్న వారితో ఆరా తీశారు. ఆసుపత్రిలో అన్ని పడకలు వెతికినా జాడ లేకపోవడంతో 12న మూడో ఠాణాలో ఫిర్యాదు చేశారు. తాము రోజూ ఆసుపత్రికి వచ్చి వైద్యులని వేడుకుంటున్నామనిసుబ్రహ్మణ్యం వాపోయారు.

ఆచూకీ లభించలేదు

సిబ్బందితో మొత్తం వెతికించినా ఫలితం లేక పోలీసులకు తెలిపామని ఆర్‌ఎంవో ఆనంద్‌కుమార్‌ తెలిపారు. రోగుల రద్దీతో సిబ్బంది, వైద్యులు గుర్తించకపోయి ఉండొచ్చని, సీసీ టీవీలో లైవ్‌ వీడియో మాత్రమే కనిపిస్తుందనీ, రికార్డింగ్‌ లేకపోవడంతో పాత వీడియో చూడలేమన్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:

'కాటన్ జయంత్యుత్సవం : గోదావరి జిల్లాల హృదయాల్లో ఆయన ఎప్పటికీ దేవుడే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.