ETV Bharat / state

క్రీడాకారులకు గుదిబండలా మారిన కొవిడ్ సంక్షోభం

ఉత్సాహం ఉంది.. నైపుణ్యం ఉంది.. రాణించే సత్తా ఉంది.. కానీ ఆటలకు అనువైన ప్రాంగణాలు అందుబాటులో లేవు. కొవిడ్ సంక్షోభం.. క్రీడలకు ప్రతిబంధకంగా మారింది. ఆట స్థలాలకు మంజూరైన నిధులు విడుదలవ్వకపోవడంతో.. వసతుల్లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.

covid effect
covid effect
author img

By

Published : Aug 26, 2021, 4:34 PM IST

క్రీడాకారులకు గుదిబండలా మారిన కొవిడ్ సంక్షోభం

కరోనా ఆంక్షలు క్రీడాకారులకు గుదిబండలా మారాయి. క్రీడా మైదానాలు నేటికీ తెరుచుకొని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని క్రీడా ప్రాధికార సంస్థలో ఇండోర్, మల్టీపర్పస్ స్టేడియాలు ఉన్నాయి. వీటిలో షటిల్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, వ్యాయామశాల, యోగా, టైక్వాండో ప్రాంగణాలున్నాయి. అవుట్ డోర్ విభాగంలో ఖోఖో, కబడ్డీ, హాకీ, క్రికెట్, వాలీబాల్ కోర్టులతోపాటు విశాలమైన వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అదే విధంగా.. అనేక మండలాల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. స్టేడియాల్లో వస్తువులు కొంతమేర అందుబాటులో ఉన్నా.. ప్రతికూల పరిస్థితులతో వాటిని సద్వినియోగం చేసుకునే వీలు లేకుండా పోయింది.

గడచిన ఏడాదిన్నర కాలంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిలిచిపోవడంతో క్రీడల రిజర్వేషన్ కోటాను ఆటగాళ్లు కోల్పోయారు. క్రీడా మైదానాల్లో నిర్వహణ లేక ఎక్కడికక్కడే చెట్లు, కలుపు పెరిగి.. ఆటలు ఆడేందుకు వీలులేకుండా మారిపోయాయి. ప్రభుత్వం చొరవ చూపి ఆటలు ఆడేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాలను మార్చాలని క్రీడాకారులు కోరుతున్నారు.

కొన్నేళ్లుగా క్రీడాప్రాంగణాలకు మంజూరైన నిధులు విడుదల కాక... ఆటగాళ్లు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున NTR క్రీడా వికాస కేంద్రాలు 11మంజూరయ్యాయి. బిల్లులు మంజూరు కాక నాలుగు మినహా మిగిలినవి అరకొర నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. నిధుల కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సెట్రాజ్ అధికారులు చెబుతున్నారు. ఆటలు ఆడేందుకు వీలుగా మైదానాలను వీలైనంత త్వరగా చక్కదిద్దాలని క్రీడాకారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Afghan Crisis: అఫ్గాన్​లో తాలిబన్లను మించిన ఆహార సంక్షోభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.