ETV Bharat / state

మండపేటలో కరోనా కలకలం.. అధికారులు అప్రమత్తం - ఏపీలో కరోనా మరణాలు

తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో కరోనా కలకలం రేగింది. స్థానిక మేధర వీధి ప్రాంతంలో కరోనా అనుమానితులు ఉన్నారని గుర్తించిన అధికారులు.. ఆ ప్రాంతంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కరోనా అనుమానితుల ఇంటి పరిసరాల్లో పోలీసులు పహారా కాశారు.

Corona suspects in Mandapeta
మండపేటలో కరోనా అనుమానితులు
author img

By

Published : Apr 19, 2020, 11:59 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో స్థానిక మేధర వీధి ప్రాంతంలో కరోనా అనుమానితులు ఉన్నారని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ప్రాంతంలో రెడ్​ అలెర్ట్​ ప్రకటించి.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో ఏడుగురు అనుమానితులను పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒక మహిళ రాజమండ్రిలో కరోనా బాధితురాలైన తన బంధువుని పరామర్శించడానికి వెళ్లింది. దీని వల్ల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రామచంద్రపురం ఆర్డీవో గణేష్ కుమార్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తమ ప్రాంతంలో కరోనా కలకలంపై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి..

'ఇంట్లోనే మనం.. కరోనా ఖననం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.