ETV Bharat / state

జెండా ఎగరేసిన కరోనా పాజిటివ్ వ్యక్తి

author img

By

Published : Aug 15, 2020, 5:52 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూకే ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో కరోనా పాజిటివ్ వ్యక్తి జెండా ఆవిష్కరించారు. పీపీఈ కిట్ ధరించిన ఆ వ్యక్తి వైద్యుల పర్యవేక్షణలో వేడుకల్లో పాల్గొన్నారు. కరోనాపై అపోహల్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఐ గోవిందరాజులు చెప్పారు.

జెండా ఎగరేసిన కరోనా పాజిటివ్ వ్యక్తి
జెండా ఎగరేసిన కరోనా పాజిటివ్ వ్యక్తి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం సర్పవరం జేఎన్​టీయూకే ప్రాంగణంలో శనివారం స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. సీఐ గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరోనా చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పీపీఈ కిట్ ధరించి ఆ వ్యక్తి వేడుకల్లో పాల్గొన్నారు. జేఎన్టీయూకేలో కొవిడ్ 19 సెంటర్ నిర్వహిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐ గోవిందరాజులు తెలిపారు.

ఇదీ చదవండి : జనగణమన గీతం.. జపనీయుల శ్రావ్యమైన సంగీతం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.