మూగ జీవాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం నుంచి గోకవరం వెళ్లే రహదారిలో కోతులు రోడ్డుకి ఇరు వైపులా ఉంటాయి. ఆ దారిన ప్రయాణం చేసే వందలాది ప్రయాణికులు నిత్యం వాటికి ఆహారం అందిస్తుండేవారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ ఆ రహదారిలో ప్రయాణం చేయటం లేదు. ఫలితంగా ఆహారం లేక కోతులు బక్క చిక్కాయి. తిండి కోసం ఆర్తనాదాలు చేయటం మొదలుపెట్టాయి.
ఆకలి బాధతో అలమటిస్తున్న ఆ కోతులను చూసి జగ్గంపేటకు చెందిన కర్రీ రామచంద్రారెడ్డి.. తన స్నేహితుడు నరసింహారావుతో కలిసి వాటి కడుపు నింపే ప్రయత్నం చేశారు. బియ్యం, శనగపప్పు, అరటిపళ్లను శ్రీ రాముని బంటులైన కోతులకి శ్రీరామ నవమి నాడు ఆహారంగా అందించారు. ఎన్నో రోజులుగా సరైన తిండి లేక అలమటిస్తున్న ఆ మూగ జీవాలు ఆహారాన్ని ఆనందంగా ఆరగించాయి.
ఇదీ చూడండి: