తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో కరోనా కలకలం రేపుతోంది. గ్రామంలో 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో అతనిని సోమవారం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 200 మీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, రెడ్ జోన్ పరిధిలో ఉన్న వారికి నిత్యావసరాల నిమిత్తం వాలంటీర్లు అందుబాటులో ఉంటారని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి