ETV Bharat / state

యానాంలో కరోనా ఉద్ధృతి... 600 దాటిన పాజిటివ్ కేసులు - యానాంలో కరోనా కేసులు

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కరోనా కేసులు 600 దాటాయి. గత 30 రోజుల్లోనే 300 కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రులో చికిత్స పొందుతున్న బాధితులను పీపీఈ కిట్లు ధరించి మంత్రి మల్లాడి కృష్ణారావు పరామర్శించారు.

corona cases in yaanaam
యానాంలో 600కు చేరిన కరోనా కేసులు
author img

By

Published : Aug 23, 2020, 6:53 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కరోనా కేసుల సంఖ్య 600 దాటింది. గత 30 రోజుల్లోనే 300 కేసులు నమోదయ్యాయి. పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ కేంద్రం వద్ద రోజుకు దాదాపు 300 మందికి పరీక్షలు చేస్తున్నారు. నమూనాలను కాకినాడ పంపిస్తున్నారు. ఫలితాలు వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుండటంతో శాంపిల్ ఇచ్చిన వారిని హోం క్వారంటైన్​లో ఉంచుతున్నారు.

యానాంలో 64 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 46 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. 480 మంది కోలుకోగా.. 15 మంది మృతిచెందారు. పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో ఉన్నవారిని పరామర్శించారు. వైద్య సదుపాయాలు, ఆహార నాణ్యం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి..

నిమజ్జనంలో అపశృతి... చెరువులో మునిగి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.