తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తపేట, ఆలమూరు మండలాల్లో గురువారం మరో 26 కేసులు నమోదయ్యాయి. కొత్తపేట మండలంలోని వానపల్లి అవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష నిర్వహించగా కొత్తపేటకు చెందిన ఆరుగురు, వానపల్లికి చెందిన మరో అయిదుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరం పాటించాలని వైద్యాధికారులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి