తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం శివారు నడిగాడిలో శుక్రవారం రెండు వర్గాల మధ్య భూ వివాదం తలెత్తింది. నడిగాడిలో పెరుగులంక భూమి కోసం స్థానిక రైతులు, అమలాపురానికి చెందిన ఒక వర్గం మధ్య ఇటీవల వివాదం మొదలైంది. మూడు రోజుల క్రితం పెరుగులంకలోని కొబ్బరి చెట్లను అమలాపురానికి చెందిన వారు తొలగించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు లంక భూమిలోకి ప్రవేశించిన కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురానికి చెందిన ఒక యువకుడు తుపాకిని బయటకు తీశాడు. నడిగాడి గ్రామస్థులు.. తుపాకిని తీసుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాల వారిని ఆ ప్రదేశం నుంచి పంపేశారు. అది డమ్మీ తుపాకి అని ఎస్సై సురేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి:
ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్..సీఎస్ పేరును చేర్చేందుకు కోర్టు అనుమతి