తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా... మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ గ్రామంలో నివసించే వారంతా మత్స్యకారులే. 6వ తేదీన సంవత్సరీకం కార్యక్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలే.. ఘర్షణకు దారితీసాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలివానై.. సోడాసీసాలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వచ్చాయి. ఈ గొడవలలో తెదేపాకు చెందిన దండుప్రోలు దాసుకు తీవ్ర గాయాలవడంతో.. అతనిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ మాసంభాషా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువురు వర్గాల వ్యక్తులు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా... మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ గ్రామంలో నివసించే వారంతా మత్స్యకారులే. 6వ తేదీన సంవత్సరీకం కార్యక్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలే.. ఘర్షణకు దారితీసాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలివానై.. సోడాసీసాలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వచ్చాయి. ఈ గొడవలలో తెదేపాకు చెందిన దండుప్రోలు దాసుకు తీవ్ర గాయాలవడంతో.. అతనిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ మాసంభాషా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
TAGGED:
పల్లంలో పోలీసుల పికెటింగ్