ETV Bharat / state

మోసపోయాం.. న్యాయం చేయండి.. డ్వాక్రా మహిళల ఆందోళన - బిజినెస్‌ కరస్పాండెంట్‌ భారతి

Dwcra Women Protest: డ్వాక్రా రుణ మొత్తం బ్యాంకులో జమ చేయకుండా బిజినెస్‌ కరస్పాండెంట్‌ భారతి తమను మోసం చేసిందని డ్వాక్రా మహిళలు ఆరోపించారు. తమ నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి.. కేవలం రూ.15 లక్షలు మాత్రమే బ్యాంకులో జమ చేసిన భారతిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.

dwcra womens protest at dhavaleswaram ps
ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన
author img

By

Published : Mar 30, 2022, 5:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి బిజినెస్‌ కరస్పాండెంట్‌ భారతి మోసానికి పాల్పడిందని.. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్​ చేశారు. 860 మంది నుంచి వసూళ్లు చేసిన డ్వాక్రా రుణం మొత్తం బ్యాంకులో జమ చేయలేదని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ధవళేశ్వరం పీఎస్‌లో బాధితులు, యూబీఐ అధికారులు ఫిర్యాదు చేశారు.

ధవళేశ్వరం, రాజవోలు పరిధిలో మొత్తం 80 గ్రూపులలో 860 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి బిజినెస్‌ కరస్పాండెంట్‌ భారతి.. వారి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి రూ.15 లక్షలు బ్యాంకులో జమ చేసింది. దీనిపై బ్యాంకులో భారతిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన భారతి.. యాసిడ్‌ తాగింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తమ నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టకుండా భారతి మోసం చేసిందని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ధవళేశ్వరం పోలీస్​​స్టేషన్​ వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు... నిధుల దుర్వినియోగం అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కరస్పాండెంట్ భారతి బెదిరింపులకు పాల్పడిందని యూబీఐ మేనేజర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: New districts: కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.