రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరిగింది. విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. సాగరతీరంలోని అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ప్రధాన నాయమూర్తి గోపి, సంయుక్త కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ రాజకుమారి.. మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు విడిచిన ఆరుగురు పోలీస్ సిబ్బందికి అంజలి ఘటించారు.
గుంటూరు పోలీస్ కవాతు మైదానంలో అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ అమరుల సేవలను స్మరించుకున్నారు. మచిలీపట్నం పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని అమరవీరులకు నివాళులర్పించారు. కర్నూలు జిల్లా మద్దికెరలో 2కె రన్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, తుని, అన్నవరం, ముమ్మిడివరం, రావులపాలెంలో పోలీసులు, విద్యార్థులు ర్యాలీ చేశారు.
అనంతపురంలో గత ఏడాది అమరులైన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు పక్కనున్న మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. పాణ్యంలో విద్యార్థులు, పోలీసులు ర్యాలీ చేశారు. కడప జిల్లా మైదుకూరులో అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా పెదనందిపాడు, అనంతపురం జిల్లా రాయదుర్గం, ప్రకాశం జిల్లా, గిద్దలూరులో భారీ ర్యాలీ జరిగింది. కడప పోలీసు మైదానంలో అమరవీరుల స్థూపానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా పోలీస్ గ్రౌండ్స్‌లో, మర్కాపురంలో అమరవీరులు స్మారక స్థూపానికి అధికారులు అంజలి ఘటించారు.
ఇదీ చదవండి