తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ కార్తీకేయ మిశ్రా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫొణి తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వాతవరణ పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే..వారిని వెంటనే తిరిగి రప్పించే ప్రయత్నం చేయలన్నారు. సహాయ చర్యలకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి.