తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రదక్షిణలు చేయకుండా నిలిపివేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఏడు ప్రదక్షిణలు చేసి నోములు నోచుకుంటారు.
ఆలయాల్లో దర్శనాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శనివారం రోజున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రదక్షిణలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ప్రదక్షిణలు నిలిపి వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్