ETV Bharat / state

చంద్రబాబు భద్రతపై కేంద్రానిదే బాధ్యత: చినరాజప్ప

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును సాధారణ వ్యక్తిలా ట్రీట్ చేయడంపై తెదేపా ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్​ ఫ్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని తనిఖీ చేయడం ఏంటని అన్నారు.

author img

By

Published : Jun 15, 2019, 5:29 PM IST

Updated : Jun 15, 2019, 11:30 PM IST

చినరాజప్ప
మీడియాతో చినరాజప్ప
శాసనసభ్యుడిగా రెండోసారి ఎన్నికైన చినరాజప్పకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. సామర్లకోట రైల్వేస్టేషన్‌ నుంచి క్యాంపు కార్యాలయం వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం చినరాజప్ప మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. తెదేపాకు ఆటుపోటులు తెలిసిన బలమైన కేడర్‌ ఉందని.. గెలుపోటములు పార్టీకి కొత్తకాదని చెప్పారు. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబును అవమానించేలా చర్యలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని చినరాజప్ప విమర్శించారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు భద్రత విషయంలో కేంద్రానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. తమ అధినేత భద్రతను కట్టుదిట్టం చేసే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Intro:స్క్రిప్ట్ మురళీకృష్ణ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కడప జిల్లా ఖరీఫ్ సాగుకు పూర్తిస్థాయి ఇంటర్వ్యూ

Body:బైట్ మురళీకృష్ణ వ్యవసాయ శాఖ జెడి కడప

Conclusion:బయట మురళీకృష్ణ వ్యవసాయ శాఖ జెడి కడప
Last Updated : Jun 15, 2019, 11:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.