పోలీసులు వైకాపా నాయకులను ఎందుకు కట్టడి చేయలేకపోయారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. విక్రమ్ హత్యను ప్రేరేపించిన గురజాల ఎమ్మెల్యేపై ఎందుకు కేసు రిజిష్టర్ చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ యువకుడు వరప్రసాద్ శిరోముండనానికి బాధ్యుడైన వైకాపా నేత కృష్ణమూర్తిపై ఎందుకు కేసు పెట్టలేదని చినరాజప్ప నిలదీశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం రాజకీయ ఒత్తిడికి తలొంచడం కాదా అని డీజీపికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎస్సీ జడ్జి రామకృష్ణని కించపరుస్తూ బహిరంగ ప్రకటన చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని చినరాజప్ప ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తిని దారుణంగా దూషిస్తూ పోస్టు పెట్టిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిలో ఎన్‌టీఆర్ విగ్రహం తొలగింపునకు సహకరించిన పోలీసు అధికారిపై ఏ చర్య తీసుకున్నారని నిలదీశారు.
ఇదీ చదవండి: అంతం కాదిది ఆరంభం: రఘురామకృష్ణరాజు