ETV Bharat / state

'కొడాలి నానిని భర్తరఫ్ చేయాలి'

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడుతుంటే సీఎం ఎందుకు అదుపు చేయడం లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

china rajappa fires on ysrcp government
చినరాజప్ప
author img

By

Published : Sep 25, 2020, 9:25 AM IST

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ వైకాపా నేతలు రాక్షసానందం పొందుతున్నారని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పథకం ప్రకారం హిందూ సంస్కృతిపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను కన్నబాబు సమర్థించడాన్ని చినరాజప్ప ఖండించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన దోషులను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నబాబు వ్యవసాయశాఖను గాలికి వదిలేసి ప్రతిపక్షంపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని కులాలు, మతాలపరంగా, ప్రాంతాలపరంగా విభజించేలా కుట్ర పన్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని ధ్వజమెత్తారు. నాని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని నిలదీశారు. కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై 90కు పైగా దాడులు జరిగాయని, వీటన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయాలను కాలరాయడమేనని చినరాజప్ప స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జీవోలో 'ముస్లిం యూత్​' అని ఎలా ప్రస్తావిస్తారు?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.