సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న వలస కూలీలకు మార్గమధ్యంలో ఆహారం దొరకడం కష్టమవుతోంది. ఇలాంటి వారికి రాజమహేంద్రవరంలో రోజువారీ కూలీలు, పేద వర్గాల వారు అంతా కలిసి.. వంటావార్పుతో ఆహారం అందించి ఔదార్యం చాటుకుంటున్నారు. బొమ్మూరు శాంతిలక్ష్మీబాయి నగర్‌కు చెందిన వారు వివిధ పనులు, చిన్న చిన్న ఉపాధి మార్గాల ద్వారా జీవనం సాగిస్తున్నారు.
వారంతా ఈ కష్ట కాలంలోనూ దాతృత్వం చాటారు. వలస కూలీలు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లడం చూసి బాధ పడ్డారు. నెలరోజులుగా అందరూ చందాలు వేసుకుని ఆహారం వండి వారికి వితరణ చేస్తున్నారు. తాజాగా.. బస్సుల్లో వెళ్లేవారికీ ఆకలి తీరుస్తున్నారు. ఇంట్లో పెద్దలు వంటావర్పు చేసి అందిస్తే పిల్లలు రహదారి పక్కన నిలబడి బస్సుల్లో వెళ్లే వారికి భోజనం పంచి పెడుతున్నారు. పేద ప్రజల సేవాగుణాన్ని అంతా అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: