ETV Bharat / state

గంగపుత్రుల వారసులకు మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ బాసట

మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రుల వారసులకు... మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ బాసటగా నిలుస్తోంది. వేటలో మెళకువలు నేర్పుతూనే....ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తోంది. ఏడాది పాటు ఉచితంగా శిక్షణ అందిస్తూ.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతోంది.

author img

By

Published : Jul 11, 2019, 1:47 PM IST

certificate-course-for-fishermerman_Heirs
గంగపుత్రుల వారసులకు మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ బాసట

వారసత్వ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుంటున్నవారిలో మత్స్యకారులు ముందు వరుసలో ఉంటారు. కష్టాలు ఎదురైనా... జీవనసాగరంలో ఎదురీదుతుంటారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ కుటుంబ పోషణ కోసం... నడిసంద్రంలో నానాయాతన పడుతుంటారు. కడలికల్లోలంగా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి వేటకు వెళ్తుంటారు. కొందరు ఇందులో తర్ఫీదు పొందితే... మరికొందరకి ఉండదు. అలాంటి వారికోసం కాకనాడలో మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ... ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసింది.

సముద్రంలో వ్యవహరించాల్సిన తీరుపై గంగపుత్రులకు నూతన విధానాలు పరిచయం చేస్తోంది. చేపల వేటకు సంబంధించిన... ప్రాథమిక విషయాల నుంచి బోటు నడపడం, వలల అల్లికపై శిక్షణ అందిస్తోంది.

టెండాల్ కమ్ డ్రైవర్ కోర్సు పేరిట మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏడాది కోర్సులో చేరేందుకు యువకులు ఆసక్తి చూపుతున్నారు. మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థలో ప్రస్తుత సంవత్సరం 55మంది శిక్షణ పొందుతున్నారు. మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, పుదుచ్ఛేరికి చెందిన వారు శిక్షణ పొందుతున్నారు.

పదో తరగతి విద్యార్హతతో మత్స్యకార యువతతో పాటు ఆసక్తి కలిగిన వారూ... కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అభ్యర్థుల కనుదృష్టి, శారీరక దారుఢ్యం, వ్యక్తిత్వం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏటా జులై చివరి వారంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

తరగతి గదుల్లో పాఠాలు బోధించడం సహా క్షేత్రస్థాయిలో ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి విద్యార్థి సుమారు 60రోజులపాటు సముద్రంలో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతకు... ప్రభుత్వం నుంచి నెలకు వెయ్యి రూపాయల భృతి అందిస్తోంది. దూరప్రాంతాల విద్యార్థులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రం అందిస్తారు. తద్వారా కేంద్ర జలసంఘం, పర్యాటక రంగం, నౌకాశ్రయాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు లభిస్తున్నాయి.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్.....గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సెక్యురిటి సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. తమకు చెల్లించాల్సిన 3 నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలని నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం నేడు విధులు బహిష్కరించి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాలాజీ సంస్థ వారు కాంట్రాక్టు ఉద్యగులు గా తమను పనిలో పెట్టుకుని వేతనాలు సకాలంలో చెల్లించడం లేదని బాధితులు వాపోయారు. తమకు వచ్చే చాలి చాలని జీతాలు అవికూడా 3 నెలలకు 6 నెలలుకు ఇస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా పరిషత్ కార్యలయాన్ని ఆశ్రయించారు. నేడు నిర్వహించే స్పందన కార్యక్రమంలో తమ సమస్యలను జిల్లా పరిపాలధికారి దృష్టికి తీసుకువెళ్ళలని బాధితులు ఉదయం 7 గంటలకే జిల్లా పరిషత్ కార్యలయానికి చేరుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించి తమకు తగిన న్యాయం చేయాలని బాధితులుకోరారు.

Body:బైట్...వెంకటలక్ష్మి...జిజిఎచ్ సెక్యురిటి సిబ్బంది.

బైట్...గౌసియా...జిజిఎచ్ సెక్యురిటి సిబ్బంది.

బైట్....సాధిక్....జిజిఎచ్ సెక్యురిటి సిబ్బంది.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.