జిల్లాలోని పొడగట్లపల్లిలోని గోపిశెట్టి వెంకటేష్, లచ్చన్న, కుడుపూడి గోపాలకృష్ణకు చెందిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. కొమర్రాజు లంకలోని కర్రీ కోటిరెడ్డి, గుర్రాల లంకయ్య పండిస్తున్న అరటిపంటను అధికారులు పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు? ఎంత పెట్టుబడి అయింది? తుపాను కారణంగా ఎంత నష్టం వాటిల్లిందని... తదితర వివరాలను రైతుల వద్ద నుంచి తెలుసుకున్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారులు నష్టం వాటిల్లిన పంటల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆలమూరు మండలం బడుగువాణిలంకలో నష్టోపోయిన పంటల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం భారీ వర్షాల కారణంగా జొన్నాడ-కాకినాడ ప్రధాన రహదారి పాడైపోవడంతో ఆ రోడ్లను పరిశీలించారు.
ఇదీ చదవండి: సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం...ఆరుగురు దుర్మరణం